Errabelli Dayakar Rao: తెలంగాణ విజయగర్జన సభ కోసం మంత్రి ఎర్రబెల్లి స్థల పరిశీలన
Errabelli Dayakar Rao: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభ ఏర్పాట్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి

వరంగల్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభ ఏర్పాట్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపనేని రమేశ్‌లతో కలిసి ఇవాళ స్థల పరిశీలన చేశారు. మామునూరులో స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్ స్థలం సభకు హాజరుకాబోయే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయేలా ఉందా అనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఇంకా ఇంతకంటే అనువైన స్థలాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా మంత్రి ఆరాతీశారు. నవంబర్ 15న జరుగబోయే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ హాజరై మాట్లాడతారని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

