Minister Dayaka Rao | తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని చెన్నూరు, పాలకుర్తి, దర్దే పల్లి, మల్లంపల్లి, వావిలాల, రేగు ల, అవుతపురం, నాంచారి మడూరు, తొర్రూరు, అమ్మపురం, గుర్తూరు, అన్నారం, పర్వతగిరిలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తారు.
ఈ సందర్భంగా మహిళల్లో ఉత్సాహం నింపేందుకు వారితో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి.. కొలిచే అద్భుతమైన పండుగ అన్న ఆయన.. ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంస్కృతి తెలంగానే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా బతుకమ్మ పండుగ నిలిచిందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగన రాష్ట్ర పండుగగా నిర్ణయించి నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.