Minister Dayakar Rao | 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ములుగుకు ఏం చేశారు.. రాహుల్, ప్రియాంకపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
Minister Dayakar Rao | 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ములుగు జిల్లాకు ఏం చేశారని.. ఏనాడైనా ప్రశ్నించారా? అంటూ కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రియాంక గాంధీలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు.
Minister Dayakar Rao | 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ములుగు జిల్లాకు ఏం చేశారని.. ఏనాడైనా ప్రశ్నించారా? అంటూ కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రియాంక గాంధీలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. విభజన హామీలను పార్లమెంట్లో ప్రస్తావించారా? వన దేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు యూపీఏ పాలనలో ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. రామప్ప ఆలయానికి ఏనాడైన పట్టించుకున్నారా? అంటూ ధ్వజమెత్తారు.
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. ములుగు జిల్లాను చేసింది సీఎం కేసీఆరేనని.. మెడికల్ కాలేజీ, జిల్లా హాస్పిటల్‌ను ఏర్పాటు చేసి.. ఏటూరునాగారం డివిజన్ కేంద్రంగా చేసి పరిపాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ములుగును అభివృద్ధి చేసింది కేసీఆరేనని, ప్రజల ఆకాంక్షలను గౌరవించి అమలు చేశారన్నారు.
బీడుబారిన అటవీ ప్రాంతం నుంచి పచ్చటితోరణంలా మార్చామని, ఇంటర్నేషనల్ టూరిజం కేంద్రంగా ఇవాళ ములుగు నిలిచిందన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే.. టూరిస్టులను ప్రజలు నమ్మరని.. దొరికిన దొంగలను వెంటేసుకుని తిరిగితే.. మిమ్మలిని దొంగల్లాగే చూస్తారన్నారు. ప్రజలు నమ్మేది బీఆర్ఎస్ పార్టీనేనని, సీఎం కేసీఆర్‌ను మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. ములుగులో బడే నాగజ్యోతిని ఆశీర్వదించి ప్రజలు గెలిపిస్తారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

