హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తేతెలంగాణ): మైనారిటీ సంక్షేమ సంస్థలు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో తన శాఖ పరిధిలోని చైర్మన్లు, శాఖాధిపతులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, టీజీఎమ్రిస్, ఖాజీలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వివిధ విభాగాల అధికారులు తమ పరిధిలోని సమస్యల జాబితా రూపొందించుకొని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సూచించారు. తమ వద్దకు వచ్చే ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు.