రెడ్యా వైద్యానికి దిక్కెవరు?

- అప్పుతెచ్చిన డబ్బులను కొట్టేసిన ఎలుకలు
- మార్పిడికీ పనికిరాని రెండు లక్షల రూపాయలు
మహబూబాబాద్ రూరల్, జూలై 17: అతనో చిరువ్యాపారి. కూరగాయలు విక్రయిస్తేనే పూట గడిచేది. ఓ వైపు వృద్ధాప్యంలోనూ కష్టాలు తప్పడం లేదు.. మరోవైపు రోజురోజుకూ కడుపులో పెరుగుతున్న కణతి కన్నీళ్లు తెప్పిస్తున్నది. దాన్ని తొలగించుకొనేందుకు అప్పుగా తెచ్చుకున్న సుమా రు రూ.రెండు లక్షలను ఎలుకలు తుక్కుతుక్కుగా కొట్టివేసి అతడికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాకు చెందిన భూక్యా రెడ్యా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూరగాయలు విక్రయిస్తుంటాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పరీక్షలు చేయించుకోగా కడుపులో కణతి ఉందని, ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. సొంతంగా పోగుచేసుకున్న రూ.20 వేలతోపాటు ఇటీవల అప్పుగా తెచ్చిన రూ.1.80 లక్షలను ఓ సంచిలో పెట్టి బీరువాలో దాచుకున్నాడు. బీరువాకు ఒక వైపు రంధ్రం పడి ఉండటాన్ని గమనించలేదు. అందులో నుంచి వచ్చిన ఎలుకలు బ్యాగుతో సహా కరెన్సీ నోట్లను చిత్తుచిత్తుగా కొరికేశాయి. శనివారం బీరువా తెరిచిన రెడ్యా ఆ డబ్బులను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వాటిని ఏ బ్యాంకుకు తీసుకెళ్లినా చెల్లవని చెప్తున్నారని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని కోరుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

