ఇంటర్ ఆధారంగా బీఈడీలో మెథడ్

బీఈడీ అడ్మిషన్ల విధానంలో మార్పులు
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు చదువకపోయినా ఆయా మెథడ్స్‌లో బీఈడీ పూర్తిచేయవచ్చు. అయితే సంబంధిత సబ్జెక్టును ఇంటర్లో మాత్రం కచ్చితంగా చదివి ఉండాలి. ఇందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో -16ను జారీచేసింది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2006లో జారీచేసిన జీవో- 92ను సవరిస్తూ, జీవో-16ను జారీచేసింది. బీఈడీ సీట్ల భర్తీ కోసం మార్గదర్శకాలను విడుదలచేసింది. ఉదాహరణకు బీసీఏ విద్యార్థులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే ఫిజికల్సైన్స్ మెథడ్‌లో చేరవచ్చు. బీబీఏ, బీసీఏ, బీబీఎం విద్యార్థులు ఇంటర్లో సోషల్‌సైన్సెస్ చదివినా బీఈడీ సోషల్స్టడీస్ మెథడ్‌లో చేరేలా మార్పులుచేసింది. కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలో సీట్లభర్తీలో ఇదే విధానాన్ని అనుసరించాలని జీవోలో పేర్కొన్నది.
మార్పులివే..
- ఫిజికల్సైన్స్ మెథడ్ తీసుకొనేవారు. బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, తత్సంబంధ సబ్జెక్టులు, బీఈ, బీటెక్‌లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీసీఏ విద్యార్థులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివినా అర్హులే.
- జీవశాస్త్రం మెథడ్ తీసుకొనేవారు బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్ కోర్సుల్లో బాటనీ లేదా జువాలజీ తత్సంబంధ సబ్జెక్టులు చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులు ఇంటర్లో జీవశాస్ర్తాన్ని చదివినా బీఈడీలో చేరవచ్చు.
- సోషల్ స్టడీస్ మెథడ్ తీసుకొనేవారు బీఏ, బీకాం పూర్తిచేసినవారే అర్హులు కాగా, తాజాగా బీబీఎం, బీబీఏ, బీసీఏతోపాటు ఇంటర్‌స్థాయిలో సోషల్‌సైన్సెస్ చదివి ఉండాలి.
- ఓరియంటల్ లాంగ్వేజెస్ మెథడ్ తీసుకొనేవారు. బీఏ తెలుగు, హిందీ, మరాఠి, ఉర్దూ, అరబిక్, సంస్కృతం, ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. బీఏ లిటరేచర్‌లో, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్, ఏంఏలో పై సబ్జెక్టులో ఏ ఒక్కటి చదివినా అయా మెథడ్ తీసుకోవచ్చు.
- బీఏ, బీకాం, బీఎస్సీతోపాటు బీసీఏ, బీబీఎం, బీఏ, ఓరియంటల్ లాంగ్వేజ్, బీబీఏ చదివినవారు సైతం బీఈడీ కోర్సులో చేరవచ్చు.
- బీఈ, బీటెక్ చదివినవారు 55శాతం మార్కులతో పాస్ అయితేనే బీఈడీ చేసేందుకు అర్హులు కాగా, దానిని 50 శాతం మార్కులకు కుదించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఇతర రిజర్వ్డ్ క్యాటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BEd Course
- intermediate
- method
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

