మేడ్చల్ జిల్లాలో రూ. 2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్‌ను విక్రయిస్తున్న ముగ్గురు

మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన పవన్ మెపిడ్రిన్ డ్రగ్‌ను స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మహేశ్ రెడ్డి పేరు చెప్పారు. తక్షణమే పోలీసులు మేడ్చల్‌లోని మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా, ఆయన వద్ద 926 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రామకృష్ణగౌడ్ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేసి, 4 కిలోల మెపిడ్రిన్ డ్రగ్‌ను సీజ్ చేశారు.
ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితులైన ఎస్కే రెడ్డి, హనుమంత రెడ్డి పరారీలో ఉన్నారు. అయితే విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

