హైదరాబాద్‌కు చేరుకున్న క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
ఆక్సిజన్ ట్యాంకర్లు | కార్పొరేట్ సామాజిక బాధ్యత ( CSR ) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి (11) క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్

హైదరాబాద్ : కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కంపెనీ లిమిటెడ్ కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత ( CSR ) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి (11) క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
బ్యాంకాక్ నుండి IL.76 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వచ్చిన 3 క్రయోజెనిక్ ట్యాంకర్లను స్వీకరించి ఆక్సిజన్ నింపడానికి ఒడిశాకు రైలులో వెళ్లే ట్యాంకర్లకు బేగంపేట వైమానిక దళం స్టేషన్ వద్ద శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫ్లాగ్ అఫ్ చేశారు. మొదటి బ్యాచ్‌గా 3 ట్యాంకర్లు హైదరాబాద్‌కు వచ్చాయని, బంగాళా ఖాతంలో అవాంతరాలు ఉన్నందున మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఎటువంటి కొరత లేకుండా తగురీతిలో ఆక్సిజన్ సరఫరా కోసం అందరు అధికారులు కోవిడ్ వ్యాప్తి నివారణకు నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం. రావు, MEIL శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

