హైదరాబాద్ : నిరుపేద క్రికెటర్లకు ఉచిత శిక్షణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేన్(HCA) పూనుకుంది. ప్రతిభ ఉండి పేదరికం వల్ల అవకాశాలు కోల్పోతున్న ఎంతో మందికి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపులు(Mega Summer Cricket Camps) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు రూ.15 లక్షల నిధులు ఇచ్చి, ప్రతి జిల్లాలో 3 క్యాంపులు నిర్వహించేల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు (Jagan mohan rao) మాట్లడుతూ.. గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ శిక్షణ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో కోచ్‌లు, పిజియోలు లేకుంటే హెచ్‌సీఏ తరపున కోచ్‌లను, పిజియోలను పంపిస్తామన్నారు.