కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు రేవంత్ చాలు
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖం కాంగ్రెస్‌దే అయినా మనసు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
- ఆయన తన భాషను మార్చుకోవాలి
- సంస్కార హీనుడు పీసీసీ అధ్యక్షుడా?
- ఇలాంటి నాయకుడిని చూడలేదు
- ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేల ఫైర్
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖం కాంగ్రెస్‌దే అయినా మనసు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్ తన భాష మార్చుకోని పక్షంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు 3 గంటల కరెంటు చాలనడంలో ఉచిత కరెంటును ఎత్తివేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ గంటలో ఎకరం నింపుతావా? అని రేవంత్‌కు సవాలు విసిరారు. రేవంత్‌పై రైతులు ఆగ్రహంగా ఉండడంతో తప్పించుకునేందుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొంగ అయిన రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవిని ఎలా ఇచ్చారోనని అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిచ్చు రేపొద్దని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని రేవంత్‌ను డిమాండ్ చేశారు.
శాసనమండలి మాజీ చైర్మన్ వీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధ్యత లేకుండా మాట్లాడితే ప్రజలు సహించరని రేవంత్‌ను హెచ్చరించారు. రాజకీయాల్లోనే రేవంత్ అత్యంత నీచుడని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కు వెయ్యికోట్ల పెట్టుబడిలాంటివని, ఆయన మాటలతో తమకు వంద నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమైందని తెలిపారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగానే ఉండాలని కోరుకుంటున్నట్టు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు రేవంత్ ఒక్కడు సరిపోతాడని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి సంస్కార హీనుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారోనని అనుమానం వ్యక్తం చేశారు. పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన వాడినేనని, కానీ రేవంత్‌లాంటి అధ్యక్షుడిని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
గంట కరెంటుతోని 10 గుంటలు పారియ్యి
నాలుగైదేండ్ల పట్టి కేసీఆర్ సార్ ఇచ్చిన కరంటుతోని ఇంతంత పంట పండించుకొని పోరగాండ్లను సాదుకుంటానం. సక్కగా సాగే సంసారంల పుల్లలు పెట్టినట్టు రేవంత్‌రెడ్డి సారు మాట్లాడుడు మంచిగ లేదు. నీకు ఎవుసం గురించి తెలిత్తే నువ్వు ఇత్తానన్న గంటకు ఎకరం పారుడు కాదు. 10 గుంటలు పారిచ్చి సూపెట్టు.
– గూడెపు సమ్మయ్య, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ జిలా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

