కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించాలి : ఎస్ఈసీ పార్థసారధి
కొవిడ్ నిబంధనలకు అనుగుణం ఎన్నిక నిర్వహించాలి | కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేయర్, ఉప మేయర్, మున్సిపల్ చైర్పర్సర్ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు. మేయర్, చైర్పర్సన్ల ఎన్నికపై బుధవారం ఆయన ఉన్నతాధికారలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమరావతి : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేయర్, ఉప మేయర్, మున్సిపల్ చైర్పర్సర్ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అధికారులకు సూచించారు. మేయర్, చైర్పర్సన్ల ఎన్నికపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ మాట్లాడుతూ.. పార్టీల విప్‌లకు అనుగుణంగా చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించాలని సూచించారు.
మొదటి రోజు ఎన్నిక జరగకపోతే రెండో రోజు నిర్వహించాలని చెప్పారు. ఎన్నిక ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలన్నారు.
ఎన్నికైన సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారు. కరోనా బాధితులు వర్చువల్ ద్వారా ప్రయాణం చేసి ఓటు వేయవచ్చని తెలిపారు.
7వ తేదీ ఎన్నిక..
ఈ నెల 7వ తేదీన గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలతోపాటు అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. 7న మధ్యాహ్నం 3 గంటల వరకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ప్రమాణస్వీకారం ముగించాలని తెలిపింది.
3 గంటల 30 నిమిషాలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

