Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది.
నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్‌కు సిద్ధమవుతుండగా ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్‌ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటులోని రెండో యూనిట్ నుంచి ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి చేస్తున్న క్రమంలో ఈఎస్పీ వద్ద యాష్ జామ్ కావడంతో ట్రిప్ అయ్యి బాయిలర్ నిలిచిపోయింది. జామ్ అయిన యాష్‌ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీడ పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

