కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా
Marri Shashidhar Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. తార్నాకలోని నివాసంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ ఆయనను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. తార్నాకలోని నివాసంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ ఆయనను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
చాలా బాధతో రాజీనామాను చేస్తున్నానని, ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందన్నారు. పూర్తి వివరాలతో సోనియా గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు. కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని, పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, తెలంగాణ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి హత్యం గుర్తు సూచించిన వారిలో తన తండ్రి ఉన్నారని శశిధర్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్‌లో నేటి పరిస్థితి ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌పై మండిపడ్డారు. మాణిక్కం ఠాగూర్ పుట్టక ముందు నుంచి రాజకీయాలు చూస్తున్నానన్నారు. ఉత్తమ్‌కుమార్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

