హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మ్యాపింగ్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించేందుకు టీ హబ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ప్రత్యేక వెబినార్ నిర్వహించనున్నట్టు టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ‘ఓపెన్ మ్యాపింగ్ ఫర్ స్టార్టప్స్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్’ అంశంపై జరిగే వెబినార్లో ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులతోపాటు సోషల్ ఎంటర్ప్రైజెస్ల నిర్వాహకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు, పేర్ల నమోదుకు ఈ కింది లింకు (https:// meeting.zoho.com/meeting/register) లో సంప్రదించాలని సూచించారు.