భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా జిల్లాలోని మణుగూరు పోలీస్ స్టేషన్ ఎంపికైంది. కేటగిరి -3 (300 – 500 FIRS) నందు ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును దక్కించుకుంది.
రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు, ఖచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన విచారణ, ప్రోయాక్టివ్ పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మొదలైన వాటిలో సాధించిన ఫలితాల అధారంగా ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తారు.
కాగా, శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ అందుకున్నారు.
రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికయ్యే విధంగా మణుగూరు పోలీసు అధికారులను నిరంతరం పర్యవేక్షించిన ఏఎస్పీ డా.శబరీష్, ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్, సీఐ ముత్యం రమేష్, పోలీస్ స్టేషన్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ దత్ అభినందనలు తెలిపారు.