Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Manne Krishank | మెడికవర్ ఆసుపత్రి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తమ కుటుంబానికి మెడికవర్‌లో వాటాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు
Manne Krishank | మెడికవర్ ఆసుపత్రి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తమ కుటుంబానికి మెడికవర్‌లో వాటాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తా.. చర్చకు సిద్ధమేనా అని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు.
రేవంత్‌రెడ్డికి సన్నిహితులుగా పేర్కొంటున్న అన్నం శరత్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, దుంప శిరీషారెడ్డికి మెడికవర్ ఆసుపత్రితో పాటు మ్యాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ట్ సంస్థల్లో షేర్లు ఉన్నాయంటూ క్రిశాంక్ వివరాలను ప్రస్తావించారు. అన్నం శరత్‌రెడ్డికి మెడికవర్ ఆసుపత్రిలో 5,08,800 షేర్లు, మ్యాక్స్ బీఎన్ ఫార్మాలో 1,08,000 షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. బ్రహ్మానందరెడ్డికి మెడికవర్‌లో 28,78,192 షేర్లు, మైండ్ వాల్ట్‌లో 65,834 షేర్లు ఉన్నాయని తెలిపారు. అలాగే దుంప శిరీషారెడ్డికి మెడికవర్‌లో 46,46,596 షేర్లు, మ్యాక్స్ బీఎన్ ఫార్మాలో 37 లక్షల షేర్లు, మైండ్ వాల్ట్‌లో 1,97,500 షేర్లు ఉన్నాయని ఆరోపించారు.
ఈ ముగ్గురికి ఆయా సంస్థల్లో వాటాలు ఉన్నాయని చెబుతూ, వాటి వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని క్రిశాంక్ కోరారు. వీరిలో కొందరికి రేవంత్‌రెడ్డి కుటుంబంతో బంధుత్వ సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రిని అమ్మేసి రూ.13,200 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారంటూ ఆరోపించారు. కష్టకాలంలో ఉన్న రైతులకు ఆ మొత్తాన్ని పంచాలని వ్యాఖ్యానించారు.
You asked for 1 Evidence @revanth_anumula ,
Here it is as promised 3 Evidences…
➡️Dumpa Sirisha Reddy
1.46,46,596 Shares for Director in Medicover Hospital,
2. is also Director with 37,00,000 Shares in your Son in Law’s Maxbien Pharma,
3.and also Director with 1,97,500 in your daughter Nymisha’s MindVault Corporate Schools➡️Brahmananda Reddy
1. 28,78,192 Shares for Director in Medicover Hospital
2. 65,834 Shares as Director in Daughter Nymisha’s MindVault➡️Annam Sharath Reddy
1. 5,08,800 Shares for Director in Medicover
2. 1,08,000 Shares for Director in Son in Law’s Maxbien Pharma…The link is clear Revanth Reddy garu.
You have successfully made Black Money into White by selling Medicover Hospital for Rs.13200 crore.
Can you initiate a CBI Investigation ❓️
or why dont you distribute the Rs.13200 crore to Farmers ❓️— Dr.Krishank (@Krishank_BRS) October 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

