పోలీస్ కొట్టాడని దళితుడి ఆత్మహత్య
న్యాయం కో సం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక పెట్రోల్ పోసుకు ని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది.
- ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికొస్తే దాడి
- అవమాన భారంతో సజీవ దహనం చేసుకున్న దళితుడు
- అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం నిరసన
అల్లాదుర్గం, నవంబర్ 7: న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక పెట్రోల్ పోసుకు నిసజీవ దహనం చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. రాంపూర్ గ్రామానికి చెందిన కిషన్ (32) తన ఫోన్ పోయిందని మంగళవారం ఫిర్యాదు చేయడానికి అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.
ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయిలు తనను కొట్టి పంపించాడని, పీఎస్‌కు వెళ్తే తనకు న్యాయం జరగలేదని, సత్యం చచ్చిపోయిందని, ఎస్సై ప్రవీణ్‌రెడ్డికి సెల్యూట్ అంటూ సూసైడ్ నోట్ రాసి బుధవారం రాత్రి రాంపూర్‌లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే కిషన్‌ను జోగిపేట దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్సకు సంగారెడ్డి దవాఖానకు తరలించగా అక్కడ మృతిచెందాడు. సూసైడ్ నోట్ చూసిన కు టుంబ సభ్యులు గురువారం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన సీఐ రేణుకారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌రెడ్డి పోస్టుమార్టం నుంచి వచ్చిన శవాన్ని నేరుగా రాంపూర్‌కు తరలించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ హామీతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

