Fire accident | నల్లగొండ జిల్లా చెరువుగట్టులో(Cheruvugattu) భారీ అగ్ని ప్రమాదం( Major fire accident) చోటు చేసుకుంది. గుట్టకింది నంది విగ్రహం సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పక్కనే ఉన్న పది షాపులు అగ్నికి దగ్ధమయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.