తెలంగాణలో మహీంద్రా అండ్ మహీంద్రా రూ.వెయ్యికోట్ల పెట్టుబడి
Mahindra and mahindara | తెలంగాణలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. జహీరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌కి అనుబంధంగా లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ : తెలంగాణలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. జహీరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌కి అనుబంధంగా లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. లాస్ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా మూడు, నాలుగు వాహనాలను తయారు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబిలిటీ వ్యాలీ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా కంపెనీ వెల్లడించింది. రూ.వెయ్యికోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌తో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశం లభించనున్నది. భవిష్యత్‌లో కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగాభారతదేశంలో సస్టెయినబుల్ మొబిలీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఇవాళ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో ఎంఓయూ కుదిరిందని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని, మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు స్థానికంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు.
కంపెనీ జహీరాబాద్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌ను మరింత విస్తరించడం ద్వారా త్రీ వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. తాజా పెట్టుబడితో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు అధికారులు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

