బీఆర్ఎస్కే అత్యధిక సీట్లు
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నదని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు.
- జననేత కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్పందన
- బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఎన్నారైల ప్రచారం
- గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నదని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు, కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఎన్నారైలు కేసీఆర్ వెంట నడుస్తున్నారని, బృందాలుగా విడిపోయి వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.
బస్సు యాత్రతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చాక కాంగ్రెస్, బీజేపీల్లో భయం మొదలైందని తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేని మహేశ్ బిగాల స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది నుంచి 12 సీట్లు వస్తాయని, కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎన్నారైలు పని చేస్తున్నారని, బీఆర్ఎస్నేత అనిల్ కుర్మాచలం చెప్పారు. తెలంగాణను దేశంలో తిరుగులేని రాష్ట్రం గా కేసీఆర్ తీర్చిదిద్దారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎన్నారై నాయకులు దూసరి అశోక్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

