Dance In PS | పోలీస్‌స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త స్టెప్పులు.. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్..!
Dance In PS | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై విచారణ జరిపి.. ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు స్టేషన్ ఎస్హెచ్ఓను వీఆర్‌కు బదిలీ చేస్తూ మల్టీజోన్ ఐజీపీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Dance In PS | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై విచారణ జరిపి.. ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు స్టేషన్ ఎస్హెచ్ఓను వీఆర్‌కు బదిలీ చేస్తూ మల్టీజోన్ ఐజీపీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహదేవ్పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో స్టెప్పులు వేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త డ్యాన్ చేసింది నిజమేనని నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాస్ స్టేషన్ ఇన్చార్జిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించడంతో ప్రజల పరిరక్షణ కోసం ఉండాల్సిన పోలీస్‌స్టేషన్‌లో ఓ ప్రైవేటు వ్యక్తి నృత్యం చేసేందుకు ప్రోత్సహించినందుకు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. స్టేషన్ ఎస్‌హెచ్‌వో జీవీ ప్రసాద్‌ను వీఆర్‌కు బదిలీ చేసినట్లు ఐజీపీ ఏవీ రంగనాథ్ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

