లవ్ స్టోరీతో ఐఏఎస్ పెండ్లి పత్రిక
ఇది ఓ యువ ఐఏఎస్ ప్రేమ కథ.. ఇంకా చెప్పాలంటే అతడి ప్రేమ గెలుపునకు రుజువు.. ప్రేయసితో ఏడడుగులు నడవబోయే అద్భుత సన్నివేశానికి ఆధారం.. అంతకుమించిన యానిమేటెడ్ వివాహ ఆహ్వాన పత్రిక..! ఓపెన్ చేస్తే.. అది రెండేండ్ల కిందట.. అప్పటికి ఆ యువకుడు ఏఈగా పనిచేస్తున్నాడు. సివిల్స్‌కు కూడా ప్రిపేర్
యానిమేటెడ్ వీడియోలో లవ్ ప్రపోజల్ నుంచి నిశ్చితార్థం దాకా
వినూత్న రీతిలో పెండ్లికి ఆహ్వానం పలికిన ఖమ్మం అడిషనల్ కలెక్టర్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 : ఇది ఓ యువ ఐఏఎస్ ప్రేమ కథ.. ఇంకా చెప్పాలంటే అతడి ప్రేమ గెలుపునకు రుజువు.. ప్రేయసితో ఏడడుగులు నడవబోయే అద్భుత సన్నివేశానికి ఆధారం.. అంతకుమించిన యానిమేటెడ్ వివాహ ఆహ్వాన పత్రిక..! ఓపెన్ చేస్తే.. అది రెండేండ్ల కిందట.. అప్పటికి ఆ యువకుడు ఏఈగా పనిచేస్తున్నాడు. సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఆ సమయంలోనే ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. చేసుకొంటే ఆమెనే పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆమెతో పరిచయం కోసం చాలా ట్రై చేశాడు. బస్సులో ఆమెను రోజూ ఫాలో అయ్యాడు. ఓ రోజు తన ప్రేమ అభ్యర్థనను ఆమెకు విన్నవించాడు. అతడి మనసును ఆమె అర్థం చేసుకొన్నది. తర్వాత కుటుంబసభ్యులతో మాట్లాడి పెండ్లి ఖాయం చేసుకొన్నాడు. ఈ కథలో యువకుడి పేరు.. రాహుల్. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్. సొంతూరు నారాయణపేట జిల్లా కేంద్రం. ఆయన ప్రేమించిన యువతి మహబూబ్‌నగర్‌కు చెందిన మనీషా. ఆమె ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కులాలు, మతాలు తెలియకుండానే వారిద్దరు ప్రేమించుకున్నారు. కులాంతర వివాహమైనా ఇరువైపులా తల్లిదండ్రులు పెద్ద మనసుతో వారి ప్రేమను అంగీకరించారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెండ్లి జరుగనున్నది. పెండ్లికొడుకు తన వివాహ ఆహ్వాన పత్రికను యానిమేటెడ్ ైస్టెల్లో తయారు చేయించారు. అందులో తాను లవ్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి నిశ్చితార్థం జరిగే వరకు ఘట్టాలను పొందుపరిచారు. యువతిపై తనకున్న ప్రేమను కవితల రూపంలో వర్ణిస్తూ, తమ రూపాలను యానిమేటెడ్‌గా చిత్రీకరించి వీడియోను రూపొందించారు. ఆ వీడియోను బంధుమిత్రులకు పంపించి పెండ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ప్రేమ కోసం ఆ ఐఏఎస్ అధికారి పడిన తపన, అందులో సాధించిన విజయం అందరినీ ఆకట్టుకొంటున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

