Liquor Tender | రేపటి నుంచే మద్యం టెండర్ల ప్రక్రియ.. నేడు రిజర్వ్డ్ షాపుల ఎంపిక ప్రారంభం
Liquor Tender | రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం గురువారం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు.
Liquor Tender | హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం గురువారం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి.
వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.రెండు లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ధారించారు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తుకు అవకాశం
ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి లైసెన్సులు జారీచేస్తారు. వార్షిక ఆర్‌ఎస్‌ఈటీ (రీటెయిల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్) ఆరు సమానా వాయిదాల్లో చెల్లించవచ్చు. మొత్తం ఆర్ఎస్ఈటీలో 25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం10 నుంచి రాత్రి 11 గంటల వరకు , ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలను అనుమతిస్తారు. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసువారు, ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్ష పడినవారు, గతంలో ఎక్సైజ్ రెవెన్యూ ఎగ్గొట్టిన వారు, కోర్టు ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించినవారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.
దుకాణాల రిజర్వేషన్ వివరాలు
మొత్తం మద్యం దుకాణాలు- 2620, ఓపెన్ క్యాటగిరీ షాపులు- 1834, మొత్తం రిజర్వుడ్ షాప్‌లు- 786 కేటాయించారు. వాటిలో గౌడలకు- 393 (15 శాతం), ఎస్సీలు- 262 (10 శాతం), షెడ్యూల్డ్ ఏరియా ఎస్టీలకు- 95, నాన్ షెడ్యూల్డ్ ఎస్టీలకు- 36, ఎస్టీలకు మొత్తం- 131 (5 శాతం) చొప్పున కేటాయిస్తారు
మద్యం లైసెన్సుల షెడ్యూల్
- రిజర్వేషన్ షాప్‌ల గుర్తింపు డ్రా- 3-8-2023
- నోటిఫికేషన్ జారీ,దరఖాస్తుల షురూ – 4-8-2023
- దరఖాస్తుల తుది గడువు- 18-8-2023
- లైసెన్సుల జారీ కోసం లాటరీ – 21-8-2023
- ఆర్‌ఎస్‌ఈటీ మొదటి చెల్లింపు గడువు- 21-8-2023 నుంచి 22-8-2023 వరకు
- కొత్త ఏ4 షాపులకు స్టాక్ విడుదల- 30-11-2023
- కొత్త షాపుల ప్రారంభం- 1-12-2023

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

