టీఎస్‌బీపాస్‌లో లే అవుట్లకు అనుమతి

- యజమానులకు అనువుగా వెబ్సైట్
- ఇప్పటికి 17,716 అనుమతులు
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): టీఎస్‌బీపాస్ ద్వారా ఇకనుంచి లే అవుట్లకు కూడా అనుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఇందులో ఇండ్లకే అనుమతి ఇస్తుండగా, పలు మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ వ్యాపారం భారీగా వృద్ధిచెందుతుండటంతో పెద్దఎత్తున లే అవుట్లు వెలుస్తున్నాయి. ప్రజల నుంచి వాటికి మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో లే అవుట్లకు అనుమతులను సరళతరం చేసేందుకు టీఎస్‌బీపాస్‌లో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఇంటి యజమానులకు అనువుగా ఉండేలా పలు మార్పులు చేశారు. డీపీఎంఎస్లోని పలు ఆప్షన్లు టీఎస్బీపాస్లోనూ తీసుకొస్తున్నారు. డీపీఎంఎస్ విధానంలో ఇండ్ల అనుమతులు నిలిపివేశాక టీఎస్బీపాస్కు దరఖాస్తులు భారీగా పెరిగాయి. టీఎస్‌బీపాస్ గతేడాది నవంబర్ 16న అమల్లోకిరాగా, 17,716 ఇండ్లకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న ఇండ్లపై అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నారు. ఏదైనా పొరపాటుతో దరఖాస్తును తిరస్కరిస్తే ఆ ఇంటి యజమాని చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతులు
అనుమతి విధానం డీటీసీపీ జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ మొత్తం
ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ (75 గజాలవరకు గృహాలు) 2,248 574 1,021 3,843
ఇన్స్టంట్ అప్రూవల్స్ (600 గజాలవరకు గృహాలు) 6, 678 856 6,05 13,589
సింగిల్ విండో అనుమతులు
(600 గజాలకుపైన గృహాలు నిర్మాణాలు) 236 30 18 284
మొత్తం 9,162 1,460 7,094 17,716
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- layout
- real estate
- tsbpass
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

