Nallagonda | రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన : డిఐజి రంగనాధ్
డిఐజి రంగనాధ్ | పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు.

నల్లగొండ : పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఫ్లాగ్ డే లో భాగంగా రక్తదానం చేసిన సిబ్బంది, యువతను ఆయన అభినందించారు.
విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదానంలో పాల్గొనేందుకు యువత సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం వల్ల మరొకరికి ప్రాణదానం జరుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఎలాంటి తారతమ్యం, కుల మతాలకు, తావు లేకుండా రక్తదానం చేయాలన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వస్తామన్నారు.

కార్యక్రమంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్.ఐ.లు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, కృష్ణారావు, నర్సింహా, వన్ టౌన్ సిఐ బాలగోపాల్, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ కె. అదిరెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, రెడ్ క్రాస్ కార్యదర్శి గోలి అమరేందర్ రెడ్డి, కోశాధికారి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్లు పుల్లారావు, ప్రవళిక, వెంకట్రామ్, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్త, ఏ.ఆర్., రెడ్ క్రాస్ సిబ్బంది, తైక్వండో శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

