కలలను నిజం చేసుకోవాలి
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ఆ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం తెలిపారు.
- కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం
- జనగామలో ‘లక్ష్యం-2024’ అవగాహన సదస్సు
జనగామ, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ఆ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇంటర్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎన్ ఫంక్షన్ హాలులో ఇంటర్ తర్వాత విద్యావకాశాలపై జనగామ ఏబీవీ జూనియర్ కాలేజీ, శ్రీగాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో 500 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చదవాలి? ఎటు వైపు వెళ్తే జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సహా ఏబీవీ జూనియర్ కాలేజీ, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు కనకరాజు, శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎంపీ మల్లేశం మాట్లాడుతూ.. ఎదగాలనే సంకల్పం బలంగా ఉన్నవారిని ఎవరూ ఆపలేరని అన్నారు. విద్యార్థుల లక్ష్యానికి కేఎల్ యూనివర్సిటీ గైడ్ తోడైతే గమ్యం మరింత సులువుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలివితేటలను ఉపయోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంటర్ తర్వాత ఎటువైపు? అనే అంశంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు ఏబీవీ, శ్రీగాయత్రి విద్యార్ధులు నమస్తే తెలంగాణ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ వరంగల్ బ్రాంచి మేనేజర్ పీఅశోక్ కుమార్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ సూరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

