లక్ష్మీ ప్రసన్న చదువుకు సహకరిస్తా : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ నాయకత్వం, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో మంచి మార్పులు తీసుకొస్తున్నాయి.

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వం, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో మంచి మార్పులు తీసుకొస్తున్నాయి. బాల్య వివాహాలు చేయకూడదని, ఆడపిల్లల అభివృద్ధిని అడ్డుకోకూడదు అని నిర్వహించిన చైతన్య కార్యక్రమం ఆడపిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచుతున్నది. ఫలితంగా బాల్య వివాహానికి సిద్ధమైన తల్లిదండ్రులని ఎదిరించే ధైర్యాన్ని, ప్రభుత్వం మీద నమ్మకాన్ని కల్పించింది.
జిల్లాలోని డోర్నకల్ మండలం, మన్నెగూడెంకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం ఈ ఏడాది పూర్తి చేసుకున్నది. అయితే ఈ వేసవి కాలంలో అమ్మాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తాను ఉన్నత చదువులు చదువుకోవాలని, వివాహం చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా వినలేదు. దీంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు స్వయంగా అమ్మాయి ఫోన్ చేసి, ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ పెండ్లిని ఆపారు.
ధైర్యంగా ముందుకు వచ్చి బాల్య వివాహాన్ని ఆపాలని ఫిర్యాదు చేసినందుకు అమ్మాయిని మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించారు. శాలువా కప్పి సన్మానం చేశారు. తాను ఉన్నత చదువులు చదవడానికి సంపూర్ణంగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

