KTR | ‘సోనియాగాంధీ అవార్డు గ్రహీత రేవంతానికి ఒక విన్నపం’.. ఎక్స్‌లో కేటీఆర్ సెటైరికల్ పోస్ట్
KTR | రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసింది. ఈ అదనపు చార్జీలను ఉటంకిస్తూ ‘నిధి నేషన్’ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
KTR : రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసింది. ఈ అదనపు చార్జీలను ఉటంకిస్తూ ‘నిధి నేషన్’ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. పండుగల వేళ మహిళల సీట్లు దొరకక, పురుషులు డబుల్ చార్జీల కారణంగా సీఎం తిడుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
రేవంత్ రెడ్డి ఏదైనా పండుగ రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల ‘రేర్’ దీవెనలను నేరుగా పొందాలని కోరారు. పండుగొస్తే చాలు బెంబేలెత్తేలా చేస్తున్న రేవంతానికి సన్మానం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు ఉచితం అంటూనే పురుషులకు ఛార్జీలు డబుల్ చేసి వాళ్లని ట్రబుల్ చేస్తున్న రేవంతాన్ని చూడటానికి జనాలు తహతహలాడుతున్నారని తెలిపారు.
‘పండగ రోజు కూడా ప్రజల సొమ్ములు కొల్లగొట్టాలంటే ప్రత్యేకమైన టాలెంట్ కావాలి..! రాఖీ రోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అంటే మామూలు తెలివి కాదు..!’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పండుగల వేళ చార్జీలు పెంచడంపై సీఎం ఓ సలహా కూడా ఇచ్చారు. ‘పోని ఒక పని చెయ్యండి. ఈ పెంచుడు కార్యక్రమాన్ని ‘ఏడో గారంటీ’ అని ప్రచారం చెయ్యండి. వీలయితే ‘పండగ గిఫ్ట్’ అని కార్డులు వేసి పంచిపెట్టండి..! జనం బాగా గుర్తుపెట్టుకుంటారు..!’ అని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

