KTR | యూకే పర్యటనకు బయల్దేరిన కేటీఆర్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) యూకే పర్యటనకు బయల్దేరారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంగ్లండ్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) యూకే పర్యటనకు బయల్దేరారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంగ్లండ్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ (Frontier Technologies for Development in India) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొననున్నారు. టెక్నాలజీ ద్వారా భారత్ సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే అంశంపై చర్చించనున్నారు. కేటీఆర్ ఈ నెల 24న హైదరాబాద్ చేరుకుంటారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

