కాంగ్రెస్ ఓటమి ఖాయం
వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్తరు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- పట్టభద్రుల ఎన్నికలపై వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్దేశం
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వారు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఒకదాన్నీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ వారిని దారుణంగా మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవసరమైన నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు తమ ఓటు ద్వారా సమాధానం చెప్తారని హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ భవన్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఓటు హకుకు అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్నూ గుర్తించి, వారందరికీ ఓటు హకు లభించేలా నమోదు ప్రక్రియను చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధతలో ప్రతి ఒకరూ భాగస్వాములై పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

