మళ్లీ వస్తం.. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తం.. పరిశ్రమలను పెట్టి ఉపాధి కల్పిస్తం: కేటీఆర్
పరిశోధన ఫలాలు సామాన్యులకు అందాలని కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కులను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ గుర్తుచేశారు.
- పరిశోధన ఫలాలు సామాన్యులకు చేరాలి
- మా హయాంలోనే మెడికల్ డివైజెస్ పార్క్
- కొవిడ్ కిట్స్ కోసం ప్రజలు కష్టాలు పడ్డరు
- విదేశాల నుంచే 80 శాతం మెడికల్ కిట్స్
- కేసీఆర్ కృషితోనే రూ.6 వేల కిట్ రూ.12కే
- సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఆర్టీ, పీసీఆర్ పరికరాల ఆవిష్కరణ
కొవిడ్‌కు ముందు దేశంలో దాదాపు 80 శాతం మెడికల్ కిట్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేంది. దేశంలోనే మెడికల్ కిట్స్ ఎందుకు ఉత్పత్తి చేయరాదు? అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి పరిశోధనలకు ప్రోత్సాహం అందించింది. కొవిడ్ సమయంలో రూ.6 వేలు ఉన్న మెడికల్ కిట్స్ ఇప్పుడు సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ రూ.12కే అందిస్తున్నది.
– కేటీఆర్
పటాన్చెరు, అక్టోబర్ 17 : పరిశోధన ఫలాలు సామాన్యులకు అందాలని కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కులను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) గుర్తుచేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులోని హ్యూవెల్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ‘లైయోబీడ్స్, పోర్టబుల్ మినీ ఆర్టీ, పీసీఆర్ పరికరాలను ఆవిష్కరించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ సామాన్యులకు వైద్య పరికరాలు అందుబాటు ధరల్లో ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల క్రితం సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇక్కడ పార్క్ ఏర్పాటుకు ముందు అడవి, కంకర క్రషర్లు ఉండేవని గుర్తుచేశారు.
పరిశ్రమలు, మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు కోసం తక్కువ ధరకే బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడిక్కడ కొత్త పరిశోధనలు చేసి సామాన్యులకు అందుబాటు ధరల్లో మెడికల్ కిట్స్‌ను అందించడం సంతోషంగా ఉన్నదని చెప్పా రు. కొవిడ్‌కు ముందు రూ.6 వేల దాకా ఉన్న మెడికల్ కిట్స్‌ను తెలంగాణలో ఉత్పత్తి చేసి రూ.12కే అం దిస్తుండటంతో సామాన్యులకు మేలు జరిగిందని తెలిపారు. మెడికల్ డివైజ్ పార్కులో వందల పరిశ్రమలు ఏర్పాటు చేసి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. కరోనా కాలంలో హ్యూవెల్ సంస్థ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తం
రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, అప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వ్యాపారవేత్తలను మరింత ప్రోత్సహిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శాస్త్రవేతలు కొత్త పరిశోధనలు చేసి మెడికల్ పరికరాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా రూపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మ భూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి (శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు), డాక్టర్ హరీశ్ లయన్, డాక్టర్. శశిధర్, డాక్టర్ రాకేశ్ మిశ్రా, డాక్టర్ లక్ష్మ వేమా పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం
మెడికల్ డివైజెస్ పార్కులో కొత్త పరికరాల ఆవిష్కరణకు వచ్చిన కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం కలికారు. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ సమీపంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పటాకులు పేల్చి ఘనంగా స్వాగతించారు. ఇక్కడ జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, అంజయ్య, ఐలాపూర్ మాణిక్ యాదవ్, కృష్ణ, నవీన్, రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

