Minister KTR | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్‌కు మై విలేజ్ షో ఫేమ్, యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ విజయతిలకం దిద్దారు. మై విలేజ్ షో బృందంతో కలిసి ఆయన ఓ వీడియో చేశారు. నిరుడు కరీంనగర్లో కళోత్సవాలకు హాజరైన కేటీఆర్‌ను గంగవ్వ బృం దం కలిసి తమతోపాటు ఓ వీడియో షోలో పాల్గొనాలని కోరారు. ఆ హామీ మేరకు శనివారం మై విలేజ్ షోలో మంత్రి కేటీఆర్ పా ల్గొన్నారు. గంగవ్వ బృందం సభ్యులతో ము చ్చట పెడుతూనే నాటు కోడి కూరను వం డారు. బగార అన్నం వండి, గుడాలు వేశారు.
ఈ సందర్భంగా ఆ బృందం అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన విద్యాభ్యాసం, బాల్యం, ఇతర కుటుంబ విషయాలను మంత్రి కేటీఆర్ పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని, రాబోయే రోజుల్లో అమలు చేయనున్న కార్యక్రమాలనూ వివరించారు. అనంతరం బృం దం సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గంగవ్వ మంత్రి కేటీఆర్‌కు కొత్త బట్టలు పెట్టి విజయతిలకం దిద్దారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మా రిం ది. మై విలేజ్షోలో పాల్గొనడం మంచిగనింపించిందని ట్విట్టర్లో కేటీఆర్ తెలిపారు.