KTR | గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి..! కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పోటెత్తుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ ఆ పార్టీకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆ పార్టీ సర్కారుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయన్నారు.
కేసీఆర్ సమున్నత సంకల్పం.. జై కొడుతోంది.. జల హారతి పడుతోందని పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం.. మొక్కవోని దీక్షతో నిలబడిందన్నారు. కొండంత బలాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. దశాబ్దాలుగా దగాపడ్డ.. ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ.. ఎప్పటికీ.. మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే ‘మేటి’గడ్డ అన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే ‘కల్పతరువు’ అని తెలిపారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి. కేసీఆర్ సర్‌కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఈ సందర్భంగా గోదావరిలో వరదకు సంబంధించిన వీడియోను సైతం జతం చేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో..
కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి..
కానీ..
కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం..
సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది..పోటెత్తిన వరదకు దుష్టశక్తుల..
పన్నాగాలే పటాపంచలయ్యాయి..
కానీ..
కేసిఆర్ గారి సమున్నత సంకల్పం..
జై కొడుతోంది.. జల హారతి పడుతోంది…… pic.twitter.com/LcJDXn689C— KTR (@KTRBRS) July 20, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

