ఉచిత విద్య, వైద్యం, ఇండ్లపై చట్టం చేయండి.. ప్రధానిని కోరిన కేటీఆర్
Ministe KTR | నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా
హైదరాబాద్: నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు (ప్రధాని మోదీ) చెబుతుంటే.. మరోపక్క విద్య, వైద్యం, ఇండ్లు ఫ్రీగా ఇస్తామని ఈ జోకర్ ఎంపీ హామీలుస్తున్నాడని విమర్శించారు. ఈ దేశాన్ని బీజేపీ పాలించడం లేదా అని ప్రశ్నించారు. ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం అందిస్తామంటే మిమ్మల్ని ఎవరు ఆపారని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
తెలంగాణ బీజేపీ ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇండ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
On behalf of the @trspartyonline we will vote in parliament for Free Education, Free Healthcare & Free 2BHK Housing for the poor people of 28 states in India
I demand Hon’ble PM @narendramodi Ji to bring in Legislations in Parliament in line with his BJP Telangana’s promises
— KTR (@KTRBRS) September 15, 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

