Minister KTR | 3 పంటలా? 3 గంటలా?.. ఏది కావాలో రైతన్నలే తేల్చుకోవాలి.. మంత్రి కేటీఆర్ పిలుపు
Minister KTR | సీఎం కేసీఆర్‌ది మూడు పంటల నినాదం అయితే, కాంగ్రెస్‌ది మూడు గంటల నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నినాదం.. మూడు పంటలు, కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు, బీజేపీ విధానం.. మతం పేరిట మంటలు.
Minister KTR | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌ది మూడు పంటల నినాదం అయితే, కాంగ్రెస్‌ది మూడు గంటల నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నినాదం.. మూడు పంటలు, కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు, బీజేపీ విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా.. మతం పేరిట మంటలు కావాలా.. తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది! అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక..!!
కాంగ్రెస్ వస్తే.. నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబంధు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..
నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు చోటా చంద్రబాబు
మూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..
ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించటమే
కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపు
సన్నకారు రైతు అంటే సవతిప్రేమ నోట్లు తప్ప..
రైతుల పాట్లు తెల్వని రాబంధును నమ్మితే
రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం..
అన్నదాత నిండా మునుగుడు పక్కా..
నాడు.. ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్
నేడు.. ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్నది
3 గంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే
బకచికిన రైతు బాహుబలి మోటర్లు పెట్టాలి..
అరికాలిలో మెదడు ఉన్నోళ్లను
నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం..
మళ్లోసారి రాబంధు 3 గంటల మాటెత్తితే..
రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం..
తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్ష సమయం..!!
రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా?
3 గంటలు చాలన్న మోసకారి రాబంధు కావాలా??
అత్యధిక గ్రీన్ కవర్
దేశంలోనే అత్యధిక నర్సరీలు ఉన్న, గ్రీన్ కవర్ పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రీన్ బెల్ట్, గ్రీన్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ఎరిక్ సోలిమ్.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నర్సరీలు, వాటిలో పెంచుతున్న మొక్కలను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

