జైలుకైనా పోతం నీళ్లివ్వుండ్రి సారూ..
‘మేము జైలుకు పోవడానికైనా సిద్ధమే.. మా పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇప్పించుండ్రి సారూ’ అంటూ జూరాల రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫోన్లో వేడుకున్నారు. ‘ధైర్యంగా కొట్లాడాలె.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా మిమ్మల్ని కాపాడుకుంటం’ అంటూ రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు నమోదైన రైతులకు పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించారు.
- కేటీఆర్‌తో జూరాల రైతుల ఆవేదన సుప్రీంకోర్టుకు వళ్లైనా కాపాడుకుంటం
- కేసు నమోదైన రైతులకు కేటీఆర్ భరోసా
- అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని అభయం
- రైతులతో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి సమావేశం
- బాధితులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
మహబూబ్‌నగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మేము జైలుకు పోవడానికైనా సిద్ధమే.. మా పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇప్పించుండ్రి సారూ’ అంటూ జూరాల రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫోన్లో వేడుకున్నారు. ‘ధైర్యంగా కొట్లాడాలె.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా మిమ్మల్ని కాపాడుకుంటం’ అంటూ రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు నమోదైన రైతులకు పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించారు.
‘మీరు ధైర్యంగా ఉండండి.. కేసులకు భయపడొద్దు.. మీ వెనుక బీఆర్ఎస్ ఉంటుంది’ అని అభయం ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు. మాజీ మంత్రుల నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో జూరాల రైతులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు జూరాల కాలువ నీటిని మళ్లించుకున్న రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడంపై నేతలు భగ్గుమన్నారు. కేసులు నమోదైన రైతులతో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తదితరులు భేటీ అయి వారిని పరామర్శించారు. అప్పుడే శ్రీనివాస్‌గౌడ్‌కు కేటీఆర్ ఫోన్ చేసి రైతులతో మాట్లాడారు.
సదరు రైతులపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆత్మకూర్, అమరచింత ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని ఏ క్షణమైనా అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉండటంతో వారి కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాము జూరాల ఎడమ కాలువ వైపు నీటిని వదిలామని, ప్రాజెక్టుకు ఎంతమాత్రం నష్టం కలిగించలేదని, అయినా తమపై ప్రజా ఆస్తులు ధ్వంసం చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించారని రైతులు వివరించారు. తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని, కానీ తమ పంటలు ఎండిపోకుండా చూడాలని వేడుకున్నారు.
అధైర్యపడొద్దు : కేటీఆర్
‘రైతులు అధైర్యపడొద్దని.. బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా నాయకత్వం మొత్తం మీ వెంట నడుస్తుంది’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘కేసీఆర్ హయాంలో రైతులకు ఎన్నడూ ఈ దుస్థితి రాలేదు. కృష్ణా నదిలో నీళ్లు లేక కాదు, సుమారు 245 టీఎంసీలకు పైగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వెళ్లినయ్. ఆ నీటిని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయలేక ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకోబోయేలా సహకరించింది. పాలమూరు బిడ్డ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరుకు శత్రువులా మారిండు’ అని విమర్శించారు. గతంలో ఇలాంటి పరిస్థితి వస్తే కేసీఆర్ వెంటనే ఒక్క ఫోన్ చేస్తే కర్ణాటక ఐదు టీఎంసీల నీటిని విడుదల చేసింది’ అని గుర్తుచేశారు.
‘కాంగ్రెస్ పాలనలో పోరాటం తప్ప వేరే మార్గం లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది’ అని భరోసా ఇచ్చారు. రైతులను అరెస్టు చేస్తే చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జూరాలలో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా చేతికొచ్చే పంటలకు నీరు వదలాలని నిరసన వ్యక్తం చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గ చర్య అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే రైతులపై కేసులు పెట్టారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హుటాహుటిన కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర సీఎంను కలిశారని, 20 రోజులవుతున్నా చుక్క నీరు కూడా తేలేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. మాజీ మంత్రుల వెంట పార్టీ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

