హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : పోలీసుల వేధింపులకు గురైన జర్నలిస్ట్ రేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. గురువారం రేఖకు ఫోన్ చేసి జరిగిన పరిణామాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. చంటిపాపతో ఉన్న ఆమెను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి 8 గంటలపాటు విచారణ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేఖ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయంలో రాత్రి 12గంటల వరకు పార్టీ నాయకులు, మహిళా నేతలు, లీగల్ టీమ్‌తో మాట్లాడి అవసరమైన న్యాయసహాయం అందించాలని సూచించారు. ఈ మేరకు నాయకులు, మహిళా నేతలు రేఖ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
ప్రతిపక్ష పార్టీ ప్రెస్‌మీట్‌ను ప్రసారం చేసినందుకు ఆరు నెలల పసిబిడ్డతో ఉన్న మహిళా జర్నలిస్టును పోలీస్‌స్టేషన్‌లో విచారించడం ఆందోళన కలిగించే పరిణామమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పా రు. రేఖకు న్యాయం జరిగేదాకా అండగా ఉండి, న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించారు.