KRMB | నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కు నీటి విడుదల ఆపాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
KRMB | నల్గొండ : నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పందం కుదిరింది.
KRMB | నల్గొండ : నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు ఐదు టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు ఐదు టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24వ తేదీ వరకు ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి.
2014 నుంచి శ్రీశైలం డ్యాం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో, నాగార్జునసాగర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని గుర్తుచేసింది. రెండు జలాశయాల్లో నీటి పంపిణీని కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తున్నదని, రెండు జలాశయాల నిర్వహణ బాధ్యతలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు ఇప్పటికే ఇరు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని గుర్తుచేసింది. ఇందుకు ఆపరేషన్ ప్రొటోకాల్ రూపొందించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని, అప్పటివరకు ప్రాజెక్టుల నిర్వహణపై యథాతథస్థితిని కొనసాగించాల్సి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం గతంలో కూడా నాగార్జునసాగర్ డ్యామ్‌ను సైతం ఆక్రమించడానికి యత్నించిందని గుర్తుచేసింది.
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమై ఉండగా, ఇదే అదునుగా బుధవారం అర్ధరాత్రి 100 మంది సాయుధ పోలీసులను దింపి డ్యామ్‌ను అక్రమించేందుకు యత్నించిందని, 13వ గేట్ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేసిందని, అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిందని తెలిపింది. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నది. కుడి కాలువ ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నదని మండిపడింది. దీనిపై కేఆర్ఎంబీ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. దౌర్జన్యపూరితంగా ఏపీ చేపట్టిన నీటి తరలింపును ఆపాలని, డ్యామ్ ఆక్రమణను తొలగించి పూర్వపుస్థితిని పునరుద్ధరించి మొత్తం డ్యామ్ కంట్రోల్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. డ్యాంను కంట్రోల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు సహకరించడానికి ఈఎన్సీ హరిరాం, చీఫ్ ఇంజినీర్ ధర్మతోపాటు పలువురు సీనియర్ ఇంజినీర్లను డ్యామ్ వద్దకు పంపించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

