‘పోలీస్ అమరుల ఆశయసాధనకు కృషిచేయాలి’
SP Sunil dutt | దేశ రక్షణ, ప్రజా సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరుల స్ఫూర్తిగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం: దేశ రక్షణ, ప్రజా సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరుల స్ఫూర్తిగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హేమచంద్రాపురంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పనిచేయాలన్నారు. దేశంలో ప్రజా సంరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది 377 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు.

నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తమ ఆరోగ్యాలపై కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా అసాంఘిక శక్తులను రూపుమాపేందుకు ప్రతీ ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఇటీవల కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలను రూపుమాపాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రజలకి అండగా ఉంటూ శాంభద్రతలను కాపాడండంలో భాగంగా ప్రతీ ఒక్కరు తమవంతు కృషి చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

