టికెట్ ఫర్ సేల్.. పటాన్చెరు పాట 12 కోట్లు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్ అని, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఖరారు చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. తాను అడిగిన డబ్బు ఇవ్వని వారిని సర్వేలో ఓడిపోయినట్టు తేలిందని బ్లాక్మెయిల్చేస్తున్నాడని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
- టికెట్లు అర్రాస్కు పెట్టిన రేవంత్
- కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపణ
- వసూళ్ల జాబితా వెల్లడించిన నేత
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్ అని, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఖరారు చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. తాను అడిగిన డబ్బు ఇవ్వని వారిని సర్వేలో ఓడిపోయినట్టు తేలిందని బ్లాక్మెయిల్చేస్తున్నాడని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే రేవంత్ వచ్చి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. రేవంత్ మోసాల చిట్టా మొత్తం తన వద్ద ఉందని చెప్పారు. పటాన్చెరు టికెట్ కోసం గాలి అనిల్‌కుమార్ దగ్గర రేవంత్ రూ.12 కోట్లు తీసుకొని, ఆయనకు రెవన్యూ మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలిపారు. మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దగ్గర రూ.10 కోట్లు, 5 ఎకరాల స్థలం రేవంత్ తీసుకున్నారని చెప్పారు.
కల్వకుర్తి టికెట్ కోసం కసిరెడ్డి నారాయణరెడ్డి దగ్గర రూ.6 కోట్లు తీసుకున్నాడని వివరించారు. రేవంత్‌రెడ్డికి వసూళ్లు, మోసాలు కొత్తేమీ కాదని, ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలు ఇస్తూ దొరికిపోయాడని గుర్తుచేశారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న పారాచూట్ నేతలతో రాత్రికి రాత్రే బేరాలు కుదుర్చుకుని టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఎక్కడ పోటీచేస్తే.. తాను అక్కడ పోటీచేసి గెలుస్తానని ధీమావ్యక్తం చేశారు. రేవంత్‌ను సస్పెండ్ చేసేంతవరకు తప పోరాటం ఆగదని చెప్పారు. రేవంత్‌ను నమ్ముకుంటే కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్పారు. హుస్సేన్‌సాగర్ బుద్ధిడి విగ్రహం వద్ద రేవంత్‌ను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించేశారు.
రేవంత్‌పై ‘కొత్త’ ఆరోపణలివీ..
- పటాన్చెరు టికెట్ కోసం.. గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.12కోట్లు గెలిస్తే రెవెన్యూమంత్రి పదవి
- మహేశ్వరం టికెట్ కోసం.. చిగురింత పారిజాత నుంచి రూ.10 కోట్లు. 5 ఎకరాల స్థలం కూడా..
- కల్వకుర్తి టికెట్ కోసం.. కాంగ్రెస్ నేత కసిరెడ్డి నారాయణరెడ్డి నుంచి రూ.6 కోట్లు వసూలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


