Revanth Reddy | సీటుకు నోటుతో అమెరికాలో విల్లాలు.. నమ్మించి గొంతు కోయడంలో రేవంత్‌రెడ్డి దిట్ట: కొత్త మనోహర్‌రెడ్డి
సీటుకు నోటు తీసుకొని రేవంత్‌రెడ్డి అమెరికాలో విల్లాలు తీసుకున్నారని కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లెలగూడ సాయిరాం కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడారు.
- రేవంత్ జైలుకు పోవడం ఖాయం
- కొడంగల్‌లో పోటీ చేస్తా:కొత్త మనోహర్‌రెడ్డి
Revanth Reddy | బడంగ్‌పేట, అక్టోబర్ 27: సీటుకు నోటు తీసుకొని రేవంత్‌రెడ్డి అమెరికాలో విల్లాలు తీసుకున్నారని కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లెలగూడ సాయిరాం కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహుల నుంచి డబ్బులు, భూములు తీసుకొని నమ్మిన వాళ్లను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాగిరెడ్డి లక్ష్మారెడ్డి, గద్వాల విజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పసుపు, కుంకుమ నీళ్లు పోసుకొని ప్రమాణం చేశారని గుర్తుచేశారు.
రేవంత్ డబ్బులు, భూములు తీసుకోకపోతే భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి ప్రమాణం ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరి దగ్గర 5 ఎకరాల భూమి, రూ.10 కోట్లు, మరొకరి దగ్గర రూ.12 కోట్లు, మరొకరి దగ్గర రూ.25 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. తాను కొడంగల్‌లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రేవంత్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సోమశేఖర్‌రెడ్డిని నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. సమావేశంలో సంతోష్‌కుమార్, నర్సింగ్ యాదవ్, కార్తీక్‌రెడ్డి, పవన్, చిర్ర లింగం, శంకర్, కుసకంటి రవి, గాన్షీరాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

