ఎవరెన్ని కుట్రలు చేసినా సభ సక్సెస్
ఎవరెన్ని కుట్రలు చేసినా సింగరేణి కార్మిక గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- సర్కార్‌పై వ్యతిరేకతకు నిదర్శనం
- టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల
గోదావరిఖని, అక్టోబర్ 15: ఎవరెన్ని కుట్రలు చేసినా సింగరేణి కార్మిక గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. వేలాదిమంది సింగరేణి కార్మికులు అంచనాలకు మించి సభకు తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారని చెప్పారు.
సింగరేణిలో కుంభకోణాలు, కార్మికులకు జరుగుతున్న నష్టాలను సభలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా తెలియజేశారని తెలిపారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుట్రలను అధిగమించి అంచనాలకు మించి తరలివచ్చి సభను విజయవంతం చేసిన కార్మికులు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

