Etamatam | కాంగ్రెస్ టికెట్ కోసం రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోయిన బాధితులంతా కలిసి సంఘం పెట్టుకుంటే అది టీపీసీసీ కార్యవర్గం కంటే మించేలా ఉంది. వారిలో ఏ ఒక్కరిని కదిలించినా రేవంత్ గురించి వారు చెప్పే కథలు వింటే కండ్లు బైర్లు కమ్మాల్సిందే. సీఎం పదవిలో ఎవరున్నా… ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రభుత్వం కాన్వాయ్‌ని ఏర్పాటు చేస్తుంది. కానీ సీఎం కాకుండానే ఆ స్థాయిలో అనధికార ప్రొటోకాల్ ఉంటే ఆ బిల్డప్పే వేరుగా ఉంటుంది.
ఆ ముచ్చట తీర్చమని టికెట్ ఆశించిన ఒక రియల్టర్‌ను రేవంత్ కోరగానే, 10 నలుపు ఫార్చ్యూనర్ కార్లు కొని ఇచ్చారట. ఈ హై ఎండ్ కార్లు ఒక్కో దానికి ఎక్స్‌షో రూమ్ ధర సుమారు రూ. 34 లక్షలు. లైఫ్ టాక్స్, ఇన్సూరెన్స్ ఇతరత్రా కలుపుకుంటే అదనంగా మరో ఐదు లక్షలు. ఈ లెక్కన మొత్తంగా దాదాపు నాలుగు కోట్లు అన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుకు కూడా సదరు నేత వెనుకాడ లేదు. టికెట్ కోసం వదిలే చమురులో దీనిని అడ్వాన్స్‌గా భావించారు. కానీ తీరా టికెట్ల ఖరారుకు వచ్చే సరికి తనకు రేవంత్ బిగ్ హ్యాండ్ ఇచ్చినట్టు సదరు కార్లు కొనిచ్చిన నేత లబోదిబోమంటున్నారు. ఏదో అనుకున్నాం కానీ భలే సెకలు ఉన్నాయి రా ! నీ దగ్గర అని విన్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు.
– వెల్జాల