ఢిల్లీకి బైలెల్లిన మామిడి రైలు

లింగంపేట – జగిత్యాల నుంచి 20 వ్యాగన్లతో కిసాన్ రైలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): లింగంపేట- జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధానికి మామిడి పండ్లతో తొలి కిసాన్ రైలు మంగళవారం బయలుదేరింది. న్యూఢిల్లీలోని ఆదర్శనగర్‌కు 20 వ్యాగన్ల ద్వారా 476 టన్నుల పండ్లతో కిసాన్ రైలును జగిత్యాల నుంచి ప్రారంభించారు. మామిడి పండ్ల రవాణాదారులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్రంలో జగిత్యాలకు నాణ్యమైన మామిడి పండ్లసాగుతోపాటు ఎగుమతికి మంచి పేరు ఉన్నది.
ఇప్పటివరకు మామిడి సీజన్లో వ్యాపారస్తులు, కార్గో అగ్రిగ్రేటర్లు, రైతులు నాణ్యమైన మామిడి పండ్లను రోడ్డుమార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణాచేసేవారు. దీనికి చాలా సమయం పట్టడంతోపాటు రవాణా ఖర్చులు భారీగా ఉండేవి. కిసాన్ రైలు ద్వారా మామిడి పండ్ల రవాణా చాలా సులభమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Delhi
- farmers
- Kisan Rail
- Mango
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

