ఎవరూ బడి బంజేయలే!
విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పిల్లలు ఎవరూ మధ్యలో బడి మానేయడం లేదు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో (1-7 తరగతుల వరకు) డ్రాపౌట్ రేటు సున్నాగా నమోదైంది. ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్
- 1-7 తరగతుల వరకు డ్రాపౌట్లు జీరో
- సెకండరీలో డ్రాపౌట్ రేటు 13.9 %
- తెలంగాణలో పెరిగిన మహిళా టీచర్లు
- పురుషులు 39%.. మహిళలు 61 %
- వెల్లడించిన యూడైస్ ప్లస్ నివేదిక
హైదరాబాద్, మార్చి 10 : విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పిల్లలు ఎవరూ మధ్యలో బడి మానేయడం లేదు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో (1-7 తరగతుల వరకు) డ్రాపౌట్ రేటు సున్నాగా నమోదైంది. ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూ-డైస్ ప్లస్) నివేదిక వెల్లడించింది. 2020-21 సంవత్సరానికి యూడైస్ నివేదికను తాజాగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం జాతీయ సగటు డ్రాపౌట్ రేటు ప్రాథమికలో 0.8, ప్రాథమికోన్నతలో 1.9 శాతంగా ఉన్నది. సెకండరీ స్థాయిలో (టెన్త్ వరకు) మాత్రం తెలంగాణలో డ్రాపౌట్రేటు 13.9గా నమోదైంది. అదే జాతీయ సగటు తీసుకొంటే 14.6 శాతంగా ఉండటం గమనార్హం. పై తరగతుల్లో చేరుతున్న వారి నిష్పత్తి రేటు ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత, ప్రాథమికోన్నత నుంచి సెకండరీ వరకు 100 శాతం ఉన్నది. అదే సెకండరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు (10 నుంచి 12 తరగతులు) 69.8 శాతం మాత్రమే నమోదైంది.

చదువుల అమ్మలు..
పిల్లల సంరక్షణేకాదు.. వారికి చదువు చెప్పడం, విద్యాబుద్ధులు నేర్పించడంలోనూ మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో మహిళా టీచర్లే అధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2019-20 సంవత్సరానికి మహిళా టీచర్లే అధికంగా ఉండగా, ఈ ఏడాది సైతం అదే సంప్రదాయం కొనసాగుతున్నది. అప్పట్లో 1,31,671 పురుషులు టీచర్లుగా ఉండగా, మహిళలు 1,73,926గా ఉన్నారు. క్రమంగా బోధనా వృత్తి నుంచి పురుషులు వైదొలగుతున్నట్టు, ఈ వృత్తిని మహిళలు కైవసం చేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం టీచర్లలో 39 శాతం పురుషులు, 61 శాతం మహిళలు ఉన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులకు 99 శాతం మహిళా టీచర్లే బోధిస్తున్నారు.
- రాష్ట్రంలో మొత్తం 42,917 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 20,725 ప్రాథమిక, 7,638 ప్రాథమికోన్నత, 12,029 సెకండరీ, హయ్యర్ సెకండరీ 2,525 పాఠశాలలు.
- రాష్ట్రంలో 9,659 అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నారు. వీటిల్లో 5,630 అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లను కొనసాగిస్తున్నారు. మరో 15,016 పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను లేదా.. ప్రీ ప్రైమరీ సెక్షన్లను నిర్వహిస్తున్నారు.
- ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 13, ఉన్నత పాఠశాలల్లో 10 మందికి ఒక టీచర్ చొప్పున పనిచేస్తున్నారు. జాతీయ సగటు ప్రాథమికలో 26, ప్రాథమికోన్నతలో 19, సెకండరీలో 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో ఈ నిష్పత్తి ఉత్తమంగా ఉన్నది.
- రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 69,64,553 మంది విద్యార్థులు నమోదయ్యారు.
- పుట్టిన పిల్లల్లో మొత్తంగా 4,79,174 మంది ఒకటో తరగతిలో చేరుతున్నారు. వీరిలో 2,51,143 మంది బాలురు, 2,28,031 మంది బాలికలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

