ఖేల్ చాలూ కరో!.. సమస్త సమాచారంతో ‘లెట్స్ లర్న్ స్పోర్ట్స్’ యాప్
చాలామందికి ఆటలపై ఆసక్తి ఉన్నా ఏ క్రీడను ఎంచుకోవాలో తెలియక సందిగ్ధంలో పడుతుంటా రు. సరైన్ కోచ్, బెస్ట్ అకాడమీలను ఎలా సంప్రదించాలనే సమాచారం దొరుకక సతమతమవుతుంటారు.
- కేటీఆర్ ప్రేరణతో ఇద్దరు యువకుల సరికొత్త ఆవిష్కరణ
- క్రీడారంగంలో డిజిటల్ విప్లవం.. క్రీడాకారులకు మార్గదర్శి
నేరేడ్మెట్, జూన్ 21: చాలామందికి ఆటలపై ఆసక్తి ఉన్నా ఏ క్రీడను ఎంచుకోవాలో తెలియక సందిగ్ధంలో పడుతుంటారు. సరైన్ కోచ్, బెస్ట్ అకాడమీలను ఎలా సంప్రదించాలనే సమాచారం దొరుకక సతమతమవుతుంటారు. క్రీడాభిమానులు ఎ దుర్కొంటున్న ఈ సమస్యలను ప్రత్యక్షంగా గమనించిన ఇద్దరు యువకులు అందుకు పరిష్కారం కనుగొన్నారు. చిన్న ఆలోచన కూడా పెద్ద మార్పునకు నాంది కావచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చె ప్పిన సందేశాన్ని స్ఫూర్తితో తీసుకొని నల్లి ఉమామహేశ్వర్, మయూర్ చౌహాన్ సరికొత్త ఆవిష్కరణకు తెరతీశారు. బ్యాడ్మింటన్ కోచింగ్‌లో అనుభవమున్న ఈ ఇద్దరు యువకులు కేటీఆర్ ప్రేరణతో చాలూ(లెట్స్ లర్న్ స్పోర్ట్స్) అనే మొబైల్ యాప్‌న కు రూపకల్పన చేశారు.
క్రీడల్లో కెరీర్ అవకాశాలు ఏమిటనే సమగ్ర సమాచారాన్ని ఒకే వేదిక ద్వారా అందించే లక్ష్యంతో శ్రీ కారం చుట్టారు. క్రీడాకారులు, కోచ్‌లు, అకాడమీలు, శిక్షణ కేంద్రాలు, వివిధ క్రీడా అవకాశాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర డిజిటల్ స్పోర్ట్స్ ఎకో సిస్టంగా ఈ యాప్ పనిచేయనున్నది. ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎ దగాలనుకునే క్రీడాకారులకు ఇది మార్గదర్శిగా నిలువనున్నది. మే 27న ప్రారంభమై ఈ యాప్‌ను దేశ్యాప్తంగా విస్తరించే లక్ష్యం తో వీరి బృందం కృషిచేస్తున్నది.
ప్రతి క్రీడాకారుడూ తన ప్రతిభను గుర్తించి, సరైన శిక్షణతో ఉన్న స్థాయికి చేరుకునేలా చేయడమే తమ సంకల్పమని యాప్ రూపకర్తలు తెలిపారు. కేటీఆర్ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చుకోవాలనే సంకల్పంతో మొదలైన ఈ ప్రయాణం.. తెలంగాణ యువత సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తూ, రాబోయే రోజుల్లో క్రీడారంగంలో కొత్త అవకాశాలకు వేదికగా మారనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

