Khammam | కోరిక తీర్చాలని రౌడీ షీటర్ వేధింపులు.. టార్చర్ భరించలేక వివాహిత ఆత్మహత్య
Khammam | ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా.. రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
Khammam | ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా.. రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందని బోడ సుశీల(28)పై ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కొంతకాలంగా కన్నేశాడు. ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పత్తి తీసేందుకు సుశీల మరో మహిళతో కలిసి సోమవారం నాడు కొణిజర్ల మండలం అమ్మపాలెం వెళ్లింది. అక్కడ సుశీలను గమనించిన రౌడీషీటర్ ధరావత్ వినయ్ ఆమె దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని వేధింపులకు దిగాడు. సుశీల ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఉరేసుకుంది.
వినయ్ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సుశీల భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలు ఉన్నాయని, శవపరీక్షలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, ఉరేసుకుని మరణించిందని మాత్రమే వైద్యులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

