మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన
అక్రమాలకు అడ్డాగా గాంధీభవన్.. ఓర్వలేకే కేటీఆర్‌పై బల్మూరి దుష్ప్రచారం.. పాలనా వైఫల్యాల నుంచి డైవర్షన్‌కు యత్నం.. కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మెడికవర్ హాస్పిటల్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బినామీ దవాఖాన అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. అక్రమాలకు నిలయంగా మారిన ఆ హాస్పిటల్ వద్ద నిత్యం వందలాది మంది పోలీసులను కాపలా పెట్టారని ఆయన దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత రాయల కార్తీక్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గాంధీభవన్ అక్రమాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలను పీడిస్తున్నరు.. మంత్రులు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నరు.. హైడ్రాను బూచిగా చూపి అడ్డగోలుగా దండుకుంటున్నరు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైడ్రా పేరిట అక్రమ వసూళ్లు.. మూసీ సుందరీకరణ ముసుగులో భూదందాలు.. రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల స్కామ్.. హౌసింగ్‌బోర్డులో భూముల స్కామ్.. బడిపిల్లల బంకర్బెడ్స్ స్కామ్.. ట్రంక్ బాక్సులు, గురుకుల టెండర్లు.. కోడిగుడ్ల టెండర్లు.. ఫోర్త్‌సిటీ.. ఇలా ఏ టూ జడ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలమయమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాడని వాసుదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో బీఆర్ఎస్లో చేర్చుకోవాలని కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తన భూదందాలపై వచ్చిన ఆరోపణలపై దృష్టి మరల్చేందుకే కేటీఆర్, హరీశ్‌రావుపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కరెంట్ లేక, సాగునీరందక రుణమాఫీ కాక, రైతుభరోసా డబ్బులు జమకాక రైతులు కష్టాల్లో ఉంటే బల్మూరి మాత్రం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ కర్కశుల పార్టీ..
మూడేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దివాలా తీయించిన కాంగ్రెస్‌కు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? అని వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్లను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు, నేత కార్మికులకు ఏం చేశారో చెప్పకుండా బల్మూరి బలుపు మాటలు మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు.
మాజీ మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి.. యాడ్ ఏజెన్సీ మహిళను బంధించింది ఎవరని ప్రశ్నించారు. పిచ్చి ప్రేలాపనలు మానకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డి దోపిడీదారు అంటూ విమర్శించిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. బల్మూరి దొర అహంకారంతో వ్యవహరిస్తున్నాడని, ఇది తాను చెప్పడం లేదని, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడే ఆరోపించారని ఆయన గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

