కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా?
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వమే ‘డైవర్షన్ డ్రామా’ ఆడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
- మద్యం బ్రాండ్లపై దొరికిన ప్రభుత్వం
- ‘ధాన్యం’ టెండర్ల స్కాంతో ఉక్కిరిబిక్కిరి
- విత్తనాలు అడిగిన రైతులపై లాఠీచార్జి
- సంక్షోభం అంచున వ్యవసాయం
- ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎత్తుగడ
- ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ మద్యం విధానం కేసుల్లో కేసీఆర్ పేరు అంటూ ప్రచారం
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వమే ‘డైవర్షన్ డ్రామా’ ఆడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ‘ఫోన్ ట్యాపింగ్ లీక్స్’అస్ర్తాన్ని తెరమీదికి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నది. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘డైవర్షన్ డ్రామా’ చేయడం అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తమ అనుకూల మీడియా ద్వారా కేసీఆర్‌పై విష ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నారు.
కాదంటే అవుననిలే
రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల మద్యం రాబోతున్నదని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చిం ది. వెంటనే మంత్రి జూపల్లి ప్రెస్‌మీట్ పెట్టి మరీ కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పైగా పరువు నష్టం దావా వేస్తామని బెదిరించారు. రెండు రోజులకే తాము తెలంగాణలో అడుగుపెడుతున్నామని వివాదాస్పద కంపెనీ సోం డిస్టిలరీస్ సోమవారం ప్రకటించింది. నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చామని మంత్రి జూపల్లి సైతం ఒప్పుకున్నారు. పౌరసరఫరాలశాఖ నిర్వహించిన సన్న బియ్యం కొనుగోలు, ధాన్యం అమ్మకాల టెండర్లలో రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు బహిర్గతం చేశారు. వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టిమరీ దీనిని ఖండించారు.
తర్వాత రెండు రోజులకే ధాన్యం కొనుగోలు టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. మంత్రి స్వయంగా ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యవసాయరంగంలో 2014 నాటి పరిస్థితులు వస్తాయని కేసీఆర్ పదే పదే హెచ్చరించారు. చెప్పినట్టే ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పోలీసు పహారాలో విత్తనాల పంపిణీ జరుగుతున్నది. లైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యకు గురయ్యారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై సోమవారం బీఆర్ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
బయటికి ఎలా తెలిసింది?
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తాజా విచారణలో కేసీఆర్ పేరును బయటపెట్టారని మంగళవారం వార్తలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ‘మాజీ డీసీపీ రాధాకిషన్ చంచల్‌గూడ జైలులోని కృష్ణా బ్లాక్ బ్యారక్ నంబర్ 17లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. కొన్ని వారాలుగా ఆయన పోలీస్ కస్టడీలో కూడా లేరు. మరి ఒక్కసారిగా డీసీపీ చెప్పారంటూ మీడియాకు లీకులు ఎలా వచ్చాయి? ఏదైనా వీడియో ఆధారం ఉందా? ఎవరైనా విచారణ అధికారి ఆయనను కలిశారా? లేదా జైలు నుంచి ఆయన ఏమైనా లేఖ గానీ, ప్రెస్ రిలీజ్ గానీ ఇచ్చారా?’ అని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ధాన్యం కుంభకోణాన్ని, లిక్కర్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిందని, బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యలో న్యాయం చేయాలని పోరాడుతున్నదని గుర్తు చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అటెన్షన్ డైవర్షన్ డ్రామా మొదలు పెట్టిందని విమర్శించారు.
ప్రస్తావనే లేకున్నా కేసీఆర్‌పై దుష్ప్రచారం
ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై మంగళవారం ఢిల్లీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాదులు కేసీఆర్ పేరును ప్రస్తావించారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అసలు ఈడీ వాదనల్లో ఎక్కడా కేసీఆర్ పేరు ను ప్రస్తావించలేదని,వాంగ్మూల పత్రంలోనూ కేసీఆర్ పేరే లేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు స్పష్టం చేశారు. కావాలనే కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వాళ్లకే ఎలా తెలిసింది?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా ఒక టీవీ చానల్లోనే లీకులు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపైనా ముందస్తుగా సమాచారాన్ని ఇస్తున్నారని చెప్తున్నారు. ఆ చానల్లో కాంగ్రెస్ నేతలకు పెట్టుబడులు ఉండటమే కారణమని స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు అధికారపార్టీలోని నేతకు చెందిన మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, ప్రభుత్వ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో దేనిపై చర్చ జరగాలి?
“ ఆదిలాబాద్‌లో మంగళవారం రైతులు విత్తనాల కోసం వెళ్తే లాఠీచార్జి జరిగింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందనే చర్చ జరగాలి. నిబంధనల మేరకే సోం డిస్టిలరీస్ బ్రాండ్ మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చామని మంత్రి జూపల్లి మంగళవారం ప్రకటించారు. నాలుగైదు రోజుల్లోనే ఎలా మాట మార్చారో చర్చ జరగాలి. సన్నబియ్యం కొనుగోలు టెండర్లను రద్దు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అంటే కుంభకోణం జరిగిందని ఒప్పుకుంటున్నారా? అనే కోణంలో చర్చ జరగాలి. వనపర్తిలో శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు.
సీఎం, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలో ఒక రాజకీయ నేత హత్య జరిగి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదనే కోణంలో చర్చ జరగాలి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ప్రభుత్వ అనుకూల మీడియా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎత్తుకున్నది. కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని నిందితులు అంగీకరించారని, ఢిల్లీ మద్యం విధానంలోనూ కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందని ఊదరగొడుతున్నది” అని సీనియర్ రాజకీయవేత్తలు, సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

