KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
KCR : తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ (Batukamma Festival) ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, కె.చంద్రశేఖర్ రావు (KCR) శుభాకాంక్షలు తెలిపారు.
KCR : తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ (Batukamma Festival) ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, కె.చంద్రశేఖర్ రావు (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ, దేశంలోని అన్నిసాంప్రదాయ పండుగల్లో ప్రత్యేకమైనదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైందని గులాబీ బాస్ తెలిపారు.
ఎంగిలిపూల బతుమ్మగా ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు. పిల్లాపాపలతో ఒకచోట కూడి, ఆటాపాటలతో, ఆడపడుచులు బతుకమ్మను కొలిచి మొక్కుతారని ఆయన అన్నారు.
తెలంగాణ తొలి ప్రభుత్వం బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదానివ్వడమే కాకుండా, ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసే సాంప్రదాయాన్ని అమలు చేసిందని కేసీఆర్ వెల్లడించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్నికాపాడుతూ వారి సంక్షేమానికి పలు రకాల పటిష్ట కార్యక్రమాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

